శ్రావణమాస సమీక్ష సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఏర్పాట్లకు సంబంధించిఈఓ పెద్దిరాజు పరిపాలన కార్యలయంలో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వేద పండితులు ఆలయ మరియు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు శ్రావణమాసం మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలపకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారుశ్రావణమాసములో ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణపౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ మరియు బహుళ ఏకాదశి రోజులు, శ్రావణమాసశివరాత్రి మరియు ప్రభుత్వ సెలవురోజులలో అధికసంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మరియు పలు ఉత్తరాది, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు. మల్లన్న దర్శనం కోసం వచ్చేప్రతి భక్తుడికికూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అయిదు రోజులపాటు అనగా ఆగస్టు 15 (శ్రావణ శుద్ధ దశమి) నుంచి ( శ్రావణపౌర్ణమి) 19 వరకు భక్తులకు శ్రీస్వామివారి అలంకారదర్శనం మాత్రమే కల్పించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ అయిదు రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణపౌర్ణమి మొదలైన పర్వదినాల కారణంగా ఈ రోజులలో భక్తులు అధికసంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు.శ్రావణ మహోత్సవాల్లో శని ఆది సోమవారాలు మరియు పౌర్ణమి స్వాతంత్ర దినోత్సవం సెలవు దినాలలో గర్భాలయ అభిషేకాలు మరియు సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు, పూర్తిగా అధికారులు నిలుపుదల చేస్తున్నారు. ఐదు రోజులు మినహా నాలుగు రోజుకు నాలుగు విడుతలుగా స్వామివార్ల స్పర్శ దర్శనం భక్తులకు కల్పించబడుతుంది. స్పర్శదర్శన టికెట్లను ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే దేవస్థానం వెబ్సైట్ www.srisalladevasthanam.orgమిగతా రోజులలో గర్భాలయ ఆర్థిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా కొనసాగుతాయి.భక్తులు వివిధ సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారానే పొందవలసివుంటుంది. ఈటికెట్లను కూడా లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు పొందవచ్చు.ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువజామున గం.3.00 లకే ఆలయద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజలు జరిపించబడుతాయి.ఉభయదేవాలయాలలో గం.4.30 నుంచి మహామంగళహారతులు ప్రారంభించ బడుతాయి.మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా గం.4.30లకే భక్తులనుదర్శనాలకు అనుమతించడం జరగుతుంది.సాయంత్రం గం. 4,00ల వరకు సర్వదర్శనం కొనసాగించబడుతాయి.తిరిగి సాయంకాలం గం.4.00 నుంచి ఆలయశుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళ వాయిద్యాలు, ప్రదోషకాలపూజలు, సుసాంధ్యం తరువాత గం.5.30ల నుంచి మహామంగళహారతులు ప్రారంభించబడుతాయి.మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా సాయంకాలం గం. 5.30ల నుంచే రాత్రి గం. 11వరకు దర్శనాలు కొనసాగుతాయి.
శ్రావణమాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండు పర్యాయములు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతములు జరిపించబడుతాయి.
శ్రావణ రెండవ శుక్రవారం రోజున మరియు నాలుగవ శుక్రవారం
1250 మంది భక్తులకు మరియు తెల్లరేషన్కార్డు కలిగిన 250 మంది భక్తులకు మొత్తం 1500 మంది ముత్తైదువులకు ఈ వ్రతం జరిపించబడుతుంది.
శ్రావణ నాలగవ శుక్రవారం రోజున అనగా 30తేదీ ప్రత్యేకంగా 500 మంది చెంచు ముత్తైదువులకు, 1000 మంది ఇతర భక్తులకు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిపించబడుతాయి.వ్రతకర్తలకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు. వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదము గాజులు పసుపు కుంకుమ అమ్మవారి శేష వస్త్రంగా చీరను మరియు రవిక వస్త్రమును గాజులు అందజేస్తారు అనంతరంఅన్నప్రసాదవితరణ భవనములో భోజన ప్రసాదం అందజేయబడుతుంది. భక్తులకి ఈ ఈ సమీక్ష సమావేశంలో ఆలయ అర్చకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.