PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్ర రాష్ట్ర కోసం ఆత్మార్పణ చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు

1 min read

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ గేట్ దగ్గర ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో దేశ నాయకుల జయంతులు జరుపుకునే వారమని ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని కూడా నిర్వహించి ఘన నివాళులు అర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం కృషిచేసిన వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మంత్రి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములును స్ఫూర్తి గా తీసుకొని స్వర్గీయ ఎన్. టి. రామారావు ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందు తెలుగు, తెలుగు పదం చేర్చారన్నారు. మద్రాసు రాష్ట్రంలో విలీనమై వుండే తెలుగు ప్రజల కొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగా కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారని మంత్రి పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందని ఈ మేరకు నంద్యాల పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకున్నామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రభావంతో సత్యం, అహింస అనే ఆశయాల ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో శ్రీ పొట్టి శ్రీరాములు అనేక సంఘటనల్లో చురుకుగా పాల్గొన్నారన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతి వల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 52 రెండు రోజులు కఠోర నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశారన్నారు. ఆయన త్యాగనిరతి ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమై ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటయ్యే అవకాశానికి నాంది పలికాయన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి వర్ధంతికి ఘనమైన నివాళులర్పించడం మనందరి బాధ్యతని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఇరిగేషన్ ఎస్ఇ సుబ్బరాయుడు, డిఇఓ జనార్దన్ రెడ్డి, ఉప ఖజానా అధికారి లక్ష్మీదేవి, పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్, టూరిజం అధికారి సత్యనారాయణ, జిల్లా క్రీడల అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *