భారతదేశ సాంకేతిక విప్లవ నిర్మాత శ్రీ రాజీవ్ గాంధీ
1 min readఘనంగా శ్రీ రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు …… ఎమ్మినూర్ కాంగ్రెస్ పార్టీ
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో భారతదేశ మొదటి యువ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంది 80 వ జయంతి సంధర్భంగా మంగళవారం ఎమ్మిగనూరుకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖాసీం వలి , ఎన్ ఎస్ యు వై. జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ యువ కాంగ్రెస్ నాయకులు దాదా కలందర్ ఆధ్వర్యంలో స్థానిక బి.సి కళాశాల వసతి గృహంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళు అర్పించి , కేక్ కట్ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భారతదేశ సాంకేతిక విప్లవ నిర్మాత అని , టెక్నాలజీని, టేళ్లి కమ్యూనికేషన్లు, సమాచార సాధన పరికరాలు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన మహానీయుడని ,18ఏళ్ళకే ఓటు హక్కు కల్పించి,యువత కౌమర దశ దాటగానే ప్రజా ప్రతినిదులను ఎన్నుకోవాలని గొప్పగా సంకల్పించిన సంస్కర వాది అని ప్రస్తుత ,నేటి అధునిక టెక్నలజీ కి అంకురార్పణా చేసి కంప్యుటర్ ని భారత దేశానికి పరిచయం చేసిన గొప్ప దార్శనిక పరిపాలనదక్షుడు రాజివ్ గాంధి ఆని కొనియాడారు .భారతదేశ యువకులకు పద్ధెనిమిది సంవత్సరాలు ఉన్నవారందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే అన్నారు .విద్యార్థులకు ఎల్లప్పుడు యువతకు ఎనలేని కృషి చేశారని ఆరోపించారు .ఆధునిక టెక్నాలజీ ఘనత రాజీవ్ గాంధీని తెలిపారు .ప్రస్తుతం కంప్యూటర్, సెల్ రావటంలో ఎంతో కృషి చేశారని తెలిపారు . విద్యార్థులు యువత ప్రతి ఒక్కరు రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ,ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఆసిఫ్, భాస్కర్, కుమార్, విష్ణు, రాజు సోమశేఖర్, వీరేంద్ర ,శివశంకర్ ధనుంజయ హనుమంతు మురళి తదితరులు పాల్గొన్నారు.