శ్రీఉమా మాధవ పాఠశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని స్థానిక సంతోషనగర్ లోని శ్రీ ఉమా మాధవ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బి. మాధవ కృష్ణ మాట్లాడుతూ ప్రాచీన కళలు, ఆటలు ఇవి అన్నీ మన భారతీయ సంస్కృతిని పెంపొందించేవన్నారు. ఇలాంటి కళలను మరుగుపడకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఆధునిక సమాజంలో అందరిపై ఉందన్నారు. కావున ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ప్రాచీన కళలను, క్రీడలను ఉత్సాహపరిచి నేటి తరానికి స్ఫూర్తినివ్వాలని గుర్తు చేశారు. ఈ ముగ్గుల పోటీలలో విజయం సాధించిన వారికి పాఠశాల కరస్పాండెంట్ బి.మాధవకృష్ణ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.