చర్చిలో మొక్కుబడి తీర్చుకున్న సిద్ధార్థ రెడ్డి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు పట్టణంలోని చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆర్.సి.యం బిషప్ చర్చి లో సిద్ధార్థ రెడ్డి తను అనుకున్న మొక్కుబడిని తీర్చుకున్నారు.బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై సాయి ఈశ్వరుడు హత్య కేసు నమోదు అయిన నేపథ్యంలో బుధవారం విజయవాడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదనలు విన్న కోర్టు సాక్షా దారాలు లేనందు వల్ల కోర్టు కేసును బుధవారం కొట్టివేసింది.కేసును కొట్టి వేస్తే చర్చిలో ఏసుప్రభువు కు 101 టెంకాయలు కొడతానని సిద్ధార్థ రెడ్డి అనుకున్నారు అనుకున్న తలంపుకు గాను కేసు కొట్టివేయడంతో గురువారం మధ్యాహ్నం బిషప్ చర్చిలో సిద్ధార్థ రెడ్డి 101 టెంకాయలు కొట్టి సమర్పించుకున్నారు.బిషప్ హౌస్ గురువులు ఫాదర్ దేవదాసు,ఫాదర్ బాబు ప్రార్థన చేసిన అనంతరం సిద్ధార్థ రెడ్డిని ఆశీర్వదించారు.సిద్ధార్థ రెడ్డితో పాటు నందికొట్కూరు వైకాపా యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.