PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది సీతారాం ఏచూరి

1 min read

ఘనంగా సితారాం ఏచూరి కి నివాళి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  భారత దేశ రాజకీయాల్లో పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య,  సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు, టిడిపి మహిళ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అరుణ కమారి పేర్కొన్నారు. ఆదివారం పత్తికొండ మండల కేంద్రంలోని సాయిబాబా మందిరంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి దివంగత కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. సీతారామయ్య చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి వి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ నాయకుడు సీతారాం ఏచూరి అని, రాజకీయాలు ఏమైనా సమస్యల ప్రతిపాదికన చట్టసభల్లోను అదేవిధంగా పార్లమెంట్ బయట అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగ విలువలు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణకై కట్టుబడి ఏచూరి  పని చేశారని అన్నారు.సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, దళిత, గిరిజన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. వివిధ భావాలు, సిద్ధాంతాలు ఉన్నా, రాజకీయాల్లో అందరినీ కలుపుకొని  సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఉమ్మడి పోరాటం చేశారని చెప్పారు. విద్యార్థి దశలోనే జేఎన్టీయూ నాయకుడిగా,  ఇందిరా గాంధీని నిలదీసి విసీ పదవికి రాజీనామా చేయించారని, విద్యార్థి నాయకుడిగా అందరికీ విద్యానoదించాలనే పోరాటాన్ని దేశవ్యాప్తం చేశాడని తెలిపారు.తదనంతర రోజుల్లో  ప్రజా నాయకుడిగా తిరుగులేని నేతగా ఎదిగాడని, భారతదేశ మౌలిక పరిస్థితులు, సాంప్రదాయాలను అర్థం చేసుకొని దేశ ప్రజానీకానికి తగ్గట్టు చట్టాలు ఉండాలని పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన సీతారాం తన మేధస్సునంత ఉపయోగించి భారతదేశానికి విశేష సేవ అందించారని, అనేక రైతాంగ కార్మిక విద్యార్థి యువజన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని విజయాలు సాధించారని పేర్కొన్నారు. భారతదేశంలోనే కాకుండా,  ప్రపంచవ్యాప్తంగా మంచి దౌత్యవేత్తగా,  వివాదాల పరిష్కారకునిగా భారతదేశ ప్రతిష్ట ను ఇనుమడింప చేసి మార్క్సిస్టు మీద అవి సీతారా ఏచూరి అని కొనియాడారు. ఆయన నడిచిన బాటలో పేద మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటమే ఈరోజు మనందరి బాధ్యతని  వారు గుర్తు చేశారు. ఇదే సీతారాం ఏచూరి గారికి మనమిచ్చే నిజమైన నివాళి అని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడo, భవిష్యత్తులో వామపక్షాలు ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడంలో అందరూ సహకరిస్తారని పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆయన కన్న కలలు నిజం చేసే విధంగా నేటి కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుందని ఆ బాధ్యత నేటితరం భుజాన వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిరుపాలు, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు ఎo. అశోక్ కుమార్, సిపిఐ నాయకులు నబి రసూల్, లోక్ త్తా పార్టీ రాష్ట్ర నాయకులు  ఆనంద ఆచారి,సిపిఎం జిల్లా నాయకులు విరా శేఖర్ ప్రజాసంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి రాజా సాహెబ్, సిపిఎం నాయకులు దస్తగిరి, వెంకటేష్ రెడ్డి, పెద్దహుల్తి సురేంద్ర, గోపాల్, సిద్దయ్య, కారన్న, రామంజి, కాంతమ్మ, మధు, నర్సింహులు  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *