PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ ఉద్యోగుల 19వ వార్షికోత్సవ సీతారామ కళ్యాణ మహోత్సవం..

1 min read

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

 పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక అమీనా పేట  ఏలూరు విద్యుత్ ఉద్యోగుల 33/11 కె.వి సబ్ స్టేషన్ (నార్త్ సెక్షన్) ప్రాంగణంలో స్వస్తిశ్రీ చాoద్రమాన శ్రీ క్రోదీ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి బుధవారం వార్షికోత్సవ మహోత్సవాలు విద్యుత్ రామాలయ ఆహ్వాన కమిటీ అత్యంత ఘనంగా నిర్వహించారు. భగభగమండే భానుడి ప్రతాపాన్ని కూడా లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి. శ్రీ సీతారామ పరివార్ల స్వామి వార్ల కృపకు పాత్రులయ్యారు. దశరథ మహారాజు జేష్ట కుమారుడు వరుడు:చి: శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు కుమార్తె వధువు: చిరంజీవిల సౌభాగ్యవతి: సీతాదేవిని ఇచ్చి విద్యుత్ రామాలయం వారి దేవస్థానంలో  అత్యంత వైభవంగా బ్రహ్మాండమైన కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విద్యుత్ అధికారులు,ఉద్యోగులు, పెద్దలు కుటుంబ సభ్యులతో హాజరై కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం విందును ఏర్పాటు చేశారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యుత్ రామాలయ కమిటీని అతిధులు ఆశీర్వదించారు.

About Author