రెన్యూబై నుండి స్మార్ట్ టర్మ్ ప్లాన్
1 min readప్రధమ దశలో ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ & డిజిట్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం
సరళమైన లక్షణాలు, వినియోగదారుని అవసరాలకు అనుగుణంగా రూపకల్పన, అనేక ప్రయోజనాలు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : భారతదేశంలో ప్రముఖ ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫారమ్ రెన్యూబై, తమ మూడవ ప్రొప్రైటరీ ఉత్పత్తి రెన్యూబై స్మార్ట్ టర్మ్ ప్లాన్‌ను ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మరియు డిజిట్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు ప్రకటించింది.సాంప్రదాయ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన ఇబ్బందుల కారణంగా చాలా మంది భారతీయులు ఆర్థిక భద్రతలో వెనుకబడుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు, రెన్యూబై ప్రత్యేకంగా పని చేసే వృత్తి నిపుణులు, చిన్న వ్యాపార యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ టర్మ్ ప్లాన్ను రూపొందించింది.“మా ఆర్ బి ప్రొప్రైటరీ ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చడం మా ప్రధాన లక్ష్యం,” అని రెన్యూబై సహ వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ చటర్జీ తెలిపారు. “టర్మ్ ప్లాన్లలోని ఇబ్బందులు, లాంగ్-టర్మ్ ప్రీమియంల వల్ల వినియోగదారులు వాటిని ఆర్థిక నష్టంగా భావించే అవకాశముంది. అందుకే అందుబాటు ధరలు, మరియు గడువు కాలం వంటి అంశాలపై దృష్టి సారించాము.”ఈ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్రత్యేకంగా పని చేసే వృత్తి నిపుణులు, చిన్న వ్యాపార యజమానుల కోసం రూపొందించబడింది. సరళమైన ఫీచర్లు, అనుకూల అవకశాలు, మరియు అందుబాటులో ఉండే ధరలతో ఈ ప్లాన్ టర్మ్ ఇన్సూరెన్స్ కేటగిరీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి గల సత్తాను కలిగి ఉంది.
ప్రధాన లక్షణాలు:
1. 10 ఏళ్ల చెల్లింపు విధానం: కేవలం 10 ఏళ్ల ప్రీమియం చెల్లించి జీవితకాలం కవరేజ్ పొందే అవకాశమిచ్చే ప్రత్యేక ఫీచర్.
2. స్మార్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్: పాలసీ గడువులోనే మొత్తం ప్రీమియంను తిరిగి పొందగల అవకాశాన్ని కల్పిస్తుంది.
3. కవరేజ్: ₹50 లక్షల నుండి ₹1 కోటి వరకు మొత్తం హామీ.
4. అదనపు ప్రయోజనాలు: యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్స్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, డిసెబిలిటీపై ప్రీమియం మినహాయింపు, ప్రీమియం హాలిడే మరియు స్మార్ట్ ఎగ్జిట్ వంటి ప్రత్యేక ఫీచర్లు.
భాగస్వామ్య సంస్థలు:
ఈ మొదటి దశలో, రెన్యూబై ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మరియు డిజిట్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.
రెన్యూబై గురించి:2015లో స్థాపించబడిన రెన్యూబై, హెల్త్, లైఫ్ మరియు మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను వినియోగదారులకు అందించే సంస్థ. 1.25 లక్షల కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ సలహాదారులు, 5.5 మిలియన్ కస్టమర్లకు సేవలందిస్తూ, 1500+ నగరాలు, పట్టణాలు మరియు ప్రాంతాలను కవర్ చేస్తోంది.