సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుల సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ హోలగుంద : ఆలూరు అసెంబ్లీ హొలగుంద మండల కేంద్రంలో S D P I సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ హఫీజ్ అతఉల్ల ఖాన్ మరియు రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ గని ఈ సమావేశంలో హాజరయ్యారు అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఫలితాలు విద్వేష పూరిత రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అప్ కీ బార్ 400 పార్ అనే నినాదం బిజెపికి వికటించిందని బిజెపి సర్కార్ అనే ఏకధోరణి కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి ఎన్డీఏ సర్కార్ అని పిల్చుకోవాల్సిన పరిస్థితి బిజెపికి ఏర్పడిందని అన్నారు దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో S D P I పార్టీ సెక్యులర్ పార్టీలను సపోర్టు చేయడం జరిగిందని అన్నారు అలాగే రాబోయే రోజుల్లో ఎ స్డి పి ఐ పార్టీని బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు ఈ నాయకుల సమావేశంలో అసెంబ్లీ కమిటీ నాయకులు బ్రాంచ్ నాయకుల మరియు ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు కే, అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి రహిమాన్, మరియు అసెంబ్లీ కమిటీ మెంబర్ ఎస్ ఎండి షఫీ, టి, భాష, హెచ్, భాష ,చికెన్ బక్షి, తదితరులు పాల్గొన్నారు.