S.D.R . వరల్డ్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ..సమాజ్వాది పార్టీ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ హాస్టలను సీజ్ చేయాలి. నంద్యాల పట్టణంలోని సమాజ్వాది పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించడం జరిగింది. నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో ఉన్న ఎస్డిఆర్ స్కూల్లో విద్యాసంస్థల అధినేత కొండారెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వందమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ సిద్ధపు పాండురంగ యాదవ్, సమాజ్వాది పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవులు మాట్లాడుతూ ఈ సంఘటనలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా నిర్వహించినందుకు స్కూలు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్యం మరియు సురక్షిత కోసం స్కూల్ యాజమాన్యం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వంట గదుల పరిశుభ్రత భోజనాల నాణ్యత పై సీరియస్ గా మరిన్ని మార్గదర్శకాలను అమలు చేయాలి ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నాం .ఎస్ డి ఆర్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమకు ఇష్టం వచ్చినట్లుగా అక్రమ ఫీజులను నిర్ణయించుకొని విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎస్ డి ఆర్ స్కూలు ను ఎటువంటి హాస్టల్ పర్మిషన్ లేకుండా హాస్టల్లో విద్యార్థులను చేర్పించుకొని నాణ్యమైన ఆహారం విద్యార్థులకు పెట్టకుండా విద్యార్థులను మోసం చేస్తున్న ఎస్ డి ఆర్ స్కూల్ పై విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నక్క రాజేష్ అంబేద్కర్ వాహిని జిల్లా అధ్యక్షులు ఎనకండ్ల మధు బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు హనుమంతు కుమార్ పార్టీ నాయకులు నక్క అనిల్ కుమార్ వెంకట నాయుడు మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.