సోలార్ విరివిగా ఉపయోగించుకోవాలి
1 min readసాంప్రదాయేతర ఇందన వనరులైన సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సాంప్రదాయేతర ఇందన వనరులైన సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం స్ధానిక అమీనాపేటలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతిగృహంలో ఏర్పాటుచేసిన సోలార్ పవర్ ప్లాంట్ ను కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రూప్ టాప్ సోలార్ సిస్టం మంచి ప్రాజెక్ట్ అని, ఇక్కడ ఏర్పాటుచేసిన ప్లాంట్ బాగుందని, సంతృప్తి వ్యక్తం చేశారు. రూప్ టాప్ సోలార్ విద్యుత్ ఆదా తో పాటు అతితక్కువ ధరకే విద్యుత్ అందుతుందన్నారు. ఈ సందర్బంగా ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు మాట్లాడుతూ సాంఘీక సంక్షేమ బాలికల వసతిగృహంలో 3 కె డబ్ల్యూ సామర్ధ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. హాస్టల్లో సోలార్ ప్లాంట్ అమరిక ముందు నెలకు 950 యూనిట్లు వినియోగం ఉండగా, 3 కె డబ్ల్యూ సోలార్ ఏర్పాటు తదుపరి 432 యూనిట్లు వినియోగం జరుగుతుందన్నారు. గతంలో నెలలో సుమారు 9 వేల వరకు విద్యుత్ చార్జీలు అవుతుండగా సోలార్ ప్లాంట్ పెట్టడం మూలంగా సుమారు నెలకు రూ.4500 మాత్రమే బిల్లు వస్తుందని, బిల్లు రావడం ద్వారా సుమారు 50 శాతం వినియోగం చార్జీలు తగ్గడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట సాంఘీక సంక్షేమ శాఖ జెడి వి. జయప్రకాష్, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, విద్యుత్ శాఖ డి.ఇ. అంబేద్కర్, ఎడిఇ రాజ్ కుమార్, సోలార్ ప్లాంట్ వెండర్ సతీష్, ఎలక్ట్రికల్ ఎఇ ప్రసన్నవల్లి, తహశీల్దారు జి.వి. శేషగిరి తదితరులు ఉన్నారు.