మా నీటి కష్టాలు తీర్చండి…
1 min readఖాళీ బిందెలతో మహిళల నిరసన హొళగుందలో ఖాళీ బిందెలతో పంచాయతీ సెక్రటరి వద్ద తమ గోడును చెప్పుకుంటున్న మహిళలు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : వారాల అకబడి తాగునీటి కోసం ఎదురు చూస్తున్నా బిందె నీరు కూడా రావడం లేదని ఎన్నాళ్లు ఈ తివ్పలని మండల కేంద్రం హొళగుందలో 5వ వార్డు, బస్టాండు ఏరియాకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యలయానికి వచ్చి సెక్రటరీ రాజశేఖర్ ముందు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మహిళలు మాల్లమ్మ, యంకమ్మ, మారెమ్మ, బనవరాజ్, నేసే సిద్దప్ప, గాదెవ్ప తదితరులు మాట్లాడుతూ నెలల తరబడి మా వీధులకు నీరు రావడం లేదని అంతంత మాత్రంగా ఉన్న నమస్య వేసవి కాలం మొదలవడంతో తాగునీటి ఎద్దడి జఠిలంగా మారిందని వాపోయారు. ఏళ్ల కిందట వేసిన పైప్లాన్లో ఇప్పుడున్న జనాభకు తగ్గట్టు నీరు సరఫర జరగడం లేదని వారాల తరబడి రాకపోగా ఎప్పుడో ఒక సారి సమయపాలన లేకుండా వదిలే నీరు ఇంటికి రెండు బిందెలు కూడా రాకపోయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంటిల్లిపాది నీటి కోసం గంటల తరబడి వడిగావులు కాస్తున్నా నీరు అందండం లేదని వెంటనే సమస్యను తీర్చాలని అక్కడే బైఠాయించారు. ఆ ప్రాంతంలో వేసిన పైప్లాన్ మార్చీ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని సెక్రటరి రాజశేఖర్, సర్పంచ్ కుమారుడు వంపావతి హామివ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.