త్వరలో బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం
1 min readకార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటాం
నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలి
ఫీడ్ బ్యాక్ తీసుకొని కష్టపడిన వారికి గుర్తింపునిస్తాం
రెడ్ బుక్ ను మర్చిపోలేదు… తన పని చేసుకుపోతోంది
చంద్రగిరి ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో లోకేష్
పల్లెవెలుగు వెబ్ తిరుపతి/నారావారిపల్లె: త్వరలో బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేస్తాం, ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తాం, పార్టీకోసం అధిక సమయం కేటాయిస్తానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటాం అని అన్నారు. క్లస్టర్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో అందరిలో మూమెంట్ రావాలి. పార్టీకోసం కొంత సమయం కేటాయించాలి. నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయి. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉంది. టర్మ్ లిమిట్స్ ఉండాలి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను 3వసారి కొనసాగుతున్నాను. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలి. పాలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30శాతం కొత్తవారు రావాలి. అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుంది. అహర్నిశలు పాటుపడ్డవారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చాం. ఫీల్డ్ లో ఏం జరుగుతుందో ఎప్పటిప్పుడు తెలుసుకుంటాం.
ప్రజల్లో మమేకమై సేవలందిండి
1994 తర్వాత టిడిపి గెలవని నియోజకవర్గం చంద్రగిరి. ఈసారి భారీ మెజారిటీతో గెలిచాం. గత ప్రభుత్వంలో ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఎన్నడూ లేనివిధంగా 164 సీట్లు ఇచ్చారు, మనం ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి. ప్రజలు ఆశతో మనవైపు చూస్తున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మనం సేవలందించాలి. అహంకారంగా మాట్లాడకూడదు, రెడ్ బుక్ ను నేను మర్చిపోలేదు. తనపని తాను చేసుకుపోతుంది. యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. తప్పుచేసిన ఎవరినీ వదలే ప్రసక్తిలేదు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలామంది త్వరలో జైలుకు వెళ్తారు. అనవసరంగా కేసులు పెట్టడం మన విధానం కాదు. సోషల్ మీడియా చూసి మీరు కంగారుపడి నన్ను కంగారుపడొద్దు. తిరుపతి పార్లమెంటు పరిధిలో దొంగఓట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టం. ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో పార్టీ కేడర్ అంతా భాగస్వాములు కావాలి. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వం మంచిగా చేశారు, కష్టపడ్డారు. దేశచరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయనివిధంగా కోటి సభ్యత్వం చేశాం. జనవరి 1నుంచే కోటిమందికి ఇన్సూరెన్స్ అమలవుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. 5లక్షల బీమా ఇప్పించే బాధ్యత నాది. కార్యకర్తల పిల్లల భవిష్యత్తు గురించి అడుగుతున్నారు, ఇందుకోసం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. స్వయం ఉపాధిపై దృష్టిసారిస్తున్నాం.
మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
మనం చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది..అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను మనం ఒకేసారి వెయ్యి పెంచి 4వేలు చేశాం. గత ప్రభుత్వం వెయ్యి పెన్షన్ పెంచడానికి అయిదేళ్లు పట్టింది. వికలాంగులకు 3వేల నుంచి 6వేలు చేశాం. భారతదేశంలో ఇంత పెద్దమొత్తంలో పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అన్నక్యాంటీన్లు పెట్టాం, గ్యాస్ ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రాధాన్యత క్రమంలో బాబు సూపర్ 6 హామీలు నెరవేర్చితీరుతాం. నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సీ ప్రకటించాం, త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీచేస్తాం. గత ప్రభుత్వంలో ఏర్పడిన గుంతలు పూడ్చడానికి 2వేల కోట్లు ఖర్చయింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళుతున్నాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం మద్దతు నిస్తోంది. ఇంకా సిబ్బంది బకాయిలు 7వేల కోట్లు క్లియర్ చేయాల్సి ఉంది. వారిలా మనం పరదాలు కట్టుకుని తిరగడం లేదు, అడిగినవారికి సమాధానం చెబుతున్నాం.
వచ్చింది, ఆ బూత్ లపై ఇప్పుడు దృష్టి పెట్టాం. ఎన్నికల్లో గెలిచాక అనునిత్యం ప్రజల్లో ఉంటూ సేవలందిస్తున్నా. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాను.
చెబుతున్నారు, పాత పంచాయితీలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటాం. రాజకీయాల్లో అతిగా మాట్లాడిన వారిని ప్రజలు క్షమించరు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. గతంలో టివి ఆన్ చేస్తే బూతులు, దాడుల వార్తలు ఉండేవి. ప్రత్యర్థులపై కక్షసాధింపు మన విధానం కాదు, వారిని రాజకీయంగానే ఎదుర్కొందాం. సమస్య తలెత్తినపుడు అలిగి ఇంట్లో కూర్చుంటే పార్టీకి ద్రోహం చేసిన వారవుతారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగాలని మంత్రి లోకేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.