PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

1న కర్నూలులో దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు

1 min read

– ‘సైకో సొమాటిక్​ డిపార్డర్స్​ ’పై పలు రాష్ట్రాల వైద్యులతో చర్చ

  • కర్నూలు సైకియాట్రిక్​ సొసైటీ అధ్యక్షుడు డా. బి. రమేష్​ బాబు, ఉపాధ్యక్షుడు డా. కె.నాగిరెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు:దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సును ఈ ఏడాది జూన్​ 1న కర్నూలులో నిర్వహించనున్నట్లు కర్నూలు సైకియాట్రిక్​ సొసైటీ అధ్యక్షుడు డా. బి. రమేష్​ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్​ కె. నాగిరెడ్డి తెలిపారు.  ఈ సదస్సుకు  దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి 300 మంది మానసిక వైద్యులు హాజరవుతారని వారు పేర్కొన్నారు. గురువారం ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు సైకియాట్రిక్​ సొసైటీ అధ్యక్షుడు డా. బి. రమేష్​ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్​ కె. నాగిరెడ్డి మాట్లాడారు.  సదస్సులో సైకో సొమాటిక్​ డిపార్డర్స్​ ( శారీరక మానిసక రుగ్మతలు) పై చర్చిస్తామన్నారు. అంతేకాక దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి వల్ల శరీరంలోని హార్మోన్​ పై , నాడీ వ్యవస్థ పై మరియు రోగ నిరోధక శక్తిపైన చెడు ప్రభావం చూపుతుందని, దాని వలన బీపీ, షుగర్​, ఆస్తమా , తలనొప్పి  , పలురకాల చర్మ వ్యాధులు, కడుపులో అల్సర్​ లాంటివి వచ్చే అవకాశం ఉందన్నారు. సైకో సొమాటిక్​ వ్యాధులను ఎలా గుర్తించాలనే అంశంపై వివిధ రకాల వైద్య నిపుణులతో చర్చించి.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యం అందించే విధానంపై ప్రధానంగా చర్చిస్తామన్నారు.  జూన్​ 1 మరియు 2వ తేదీలలో నిర్వహించే దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సుకు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​, యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. రాధిక రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు డా. రమేష్​ బాబు, డా. నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో సైకియాట్రిక్​ వైద్యులు  డా. హరి ప్రసాద్​, డా. సుహృత్​ రెడ్డి, డా. శివశంకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author