ఏలూరు డివిజన్ పరిధిలో 248 పోస్ట్ఆఫీస్లలో ప్రత్యేక క్యాంపులు
1 min readఏలూరు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ ఎస్ శ్రీకర బాబు
నవంబర్ 30వ తేదీ వరకు క్యాంపులు కొనసాగుతాయి
64.81లక్షల ఖాతాలకు ఎన్ పి సిఐ లింక్ లేకుండా ఉన్నాయి
సంక్షేమ పథకాల ఫలాలు రావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు తపాలా శాఖ సంయుక్తంగా వివిధ ప్రభుత్వ పథకాల సొమ్మును లబ్దిదారులకు నేరుగా డిబిటి ద్వారా వారి ఖాతాలలో జమ చేయుటకు ఎన్ పిసిఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అనుసంధానం మరియు కొత్త అక్కౌంట్స్ ఓపెనింగ్ సులభతరం చేయటానికి ఏలూరు డివిజన్ పరిధిలో గల 248 పోస్ట్ ఆఫీసుల నందు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏలూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీకర్ బాబు తెలియజేశారు. ఇందులో భాగముగా శుక్రవారం ఏలూరు పట్టణ పరిధిలో గల ఇశ్రాయేల్ పేట లోని శివగోపాలపురం సచివాలయం నందు మరియు ఎర్రంపల్లి గ్రామము(ప్రగడవరం ) లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపుల నందు దాదాపు 200 మందికి పైగా లబ్దిదారులు వారి యొక్క ఖాతాలకు ఎన్ పిసిఐ అనుసంధానం చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యాంపులకు ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఎఫ్ఎస్) జి. శివనాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క ఫలాలు రావాలంటే అకౌంట్ నకు ఎన్ పిసిఐ నందు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉండాలని,మన రాష్ట్రంలో దాదాపు 64.81 లక్షల ఖాతాలకు ఎన్ పిసిఐ లింక్ లేకుండా ఉన్నాయని తెలిపారు. కావున ఈ ప్రత్యేక క్యాంపులు ఈ నెల 30 వ తేదీ వరకు కొనసాగుతాయని, ప్రజలు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలని, మరింత సమాచారం కోసం దగ్గరలోని పోస్ట్ ఆఫీసునకు వెళ్లాలని తెలియజేసారు. కార్యక్రమంలో ఐ.పి.పి.బి, రీజనల్ మేనేజర్, విజయవాడ సుబ్బారావు,ఏలూరు డివిజన్ ఐ.పి.పి.బి సీనియర్ మేనేజర్ కె.రాజేష్, ఏలూరు నార్త్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ జి. దుర్గారావు , ఏలూరు సౌత్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీకాంత్ మరియు ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయోజనాల ముఖ్యమైన వివరములు అర్హత18 సంవత్సరములు పైబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్టమ లోని పౌరులు. లక్ష్యం నిరుపయోగంలో ఉన్నటువంటి 64.81 లక్షల ఖాతాలను పునరుద్దరించటం,గడువు అన్ని ఖాతాలు నవంబర్ 15 వ తేదీ లోపు పునరుద్దరించుకోవాలి.