నిత్యాసర వస్తువుల ప్రత్యేక కౌంటర్లు
1 min readజాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యాసర వస్తువులు సరసమైన ధరలకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణం శ్రీనివాస్ సెంటర్ సమీపంలోని రైతు బజార్ లో పౌర సరఫరాల శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించి వినియోగదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ నూనెలు అధిక ధరలు వున్న నేపథ్యంలో నూనె మిల్లుల యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ లోని రైతు బాజార్, టేక్కే మార్కెట్ యార్డ్ లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. అలాగే ఆత్మకూరులో రెండు కేంద్రాలు, నందికోట్కూరు, బనగానపల్లి మండల కేంద్రాలలోను ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. సన్ ప్లవర్ (లీటరు)124/- రూపాయలు, పామ్ ఆయిల్ (లీటరు) 110/- చొప్పున రూపాయలు చొప్పున ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు.అలాగే అన్ని రైతు బజార్లలో టమాట కేజీ రూ.40/-లకు, ఉల్లిగడ్డ కేజీ రు.35/-ల చొప్పున వినియోగదారులకు విక్రయిస్తామని జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.