హెచ్ఐవి బాధితులు ఎటువంటి వివక్షతకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
1 min readజిల్లా న్యాయ సేవాఅధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్
కార్యక్రమంలో పాల్గొన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యం లో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము ప్రాంగణములో సహపంక్తి అల్పాహారము జిల్లా అధికారులకు, హెచ్.ఐ.వి భాదిత పిల్లలు, ట్రాన్స్ జెండర్లకు ఏర్పాటు చేశారు. కార్యక్రమములో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్,జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టివీ అధికారిఎమ్. నాగేశ్వర రావు, జిల్లా కోఆర్డినేటర్ నెహ్రు యువ కేంద్ర కిషోర్,పాజిటివ్ నెట్ వర్క్ ప్రెసిడెంట్ జె. శివ కృష్ణ ఇతర శాఖల సిబ్బంది,పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాధితులు ఎటువంటి వివక్షతకు గురికాకుండా భారత ప్రభుత్వం హెచ్.ఐ.వి / ఎయిడ్స్ 2017 చట్టం రూపొందించినదన్నారు.బాధితులు ఎటువంటి కుంగుబాటుకుపాటుకు గురికాకుండా ధైర్యంగా ఉండాలన్నారు. జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డా.ఎమ్. నాగేశ్వర రావు జిల్లా లో ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమము యొక్క ప్రగతిని వివరించారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన పెయింటింగ్, రంగోలి పోటీలలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం కార్యక్రమములో పాల్గొన్న అందరితోనూ ప్రెసిడెంట్, ఆపిల్ నెట్వర్క్ జె.శివ కృష్ణ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమములో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. బాలాజీ తదితరులు ఎ. హరినాధ కుమార్, జిల్లా సూపర్. వైజర్, యస్. విజయలక్ష్మి జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్ ఆర్ హేడ్స్, లింకు వర్కర్స్, వైఆర్జీ కేర్, వి. హెచ్. ఎస్. స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మొబైల్ ఐ.సి.టి.సి సిబ్బంది పాల్గొన్నారు.