శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ధనుర్మాస ప్రయుక్త, సోమవారం, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రము కలిసిన పర్వదినం సందర్భంగా ప్రాతఃకాలంలో రుద్రాభిషేకములు, అనంతరం అన్నాభిషేకం, అర్చనలు వైభవంగా జరిగినాయి.మరియూ పౌర్ణమి సందర్బంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం విశేషముగా జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది.