దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో దత్త జయంతి సందర్భంగా ప్రాతః కాలంలో దత్తాత్రేయ స్వామి వారి మూల విగ్రహమునకు పంచామృతాభిషేకము,విశేష అర్చనలు జరిగినవి.మరియూ విశేష తైలాభిషేకములు,భక్తులు స్వహస్తమలతో జరుపుకున్నారు. మరియూ శ్రీ దత్తానుగ్రహం కొరకు దత్త ఫలదీక్షను భక్తులు స్వీకరించి, దత్త ఫలము సమర్పించుకున్నారు, అనంతరం దత్త హోమము విశేషంగా జరిగినది. అన్ని కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ మహామంగళ హారతి తీసుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి కృపకు పాతృలైనారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినది.