శ్రీ మహా గౌరీ అమ్మవారికి ప్రాతఃకాలంలో విశేష పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ మహా గౌరీ అమ్మవారికి మాఘమాసం సందర్భంగా రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు శ్రీ మహా గౌరీ అమ్మవారికి ప్రాతఃకాలంలో విశేష అభిషేకము, అలంకరణ, అర్చనలు జరుపబడినవి. మరియు గణపతి మండపారాధనము జరిపి, శ్రీ దేవి ఖడ్గమాల లలితా సహస్రనామ అర్చనలు సామూహిక కుంకుమార్చనలు జరిగినవి. అనంతరం రాజశ్యామల హోమము జరిగినది.సాయంత్రం అమ్మవారికి ప్రదోష కాలార్చన శ్రీ రాజశ్యామల సహస్రనామార్చన, లలిత అష్టోత్తర పూజలు జరిగినవి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగినది.