శ్రీ.వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
1 min readపెద్దహ్యట గ్రామంలో వెలసిన శ్రీ.వీరభద్రేశ్వర స్వామికి శ్రావణ మాసం మూడు సోమవారం సందర్భంగా అర్చకులు రాజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : శ్రీ వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణతో నందికోలు పల్లకి శ్రీ.వీరభద్రేశ్వర వేషా దారుణం భక్తులకు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలు శ్రీ.వీరభద్రేశ్వర స్వామి పూజలో పాల్గొనడం జరిగింది. పెద్దహ్యట గ్రామంలో ఊరు చివరలో ఉన్న కొళాయి దగ్గర గంగి పూజ అంకుర్పణ ఆకు పూజ రుద్రాభిషేకం పాలాభిషేకం ఇలా ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి మేళ తాళాలతో భక్తి శ్రద్ధతో శ్రీ వీరభద్రేశ్వర స్వామి వేషా దారుణంలో గ్రామ పూర్వవీదులుగా ఊరేగింపుగా వెళ్తూ స్వామివారి మహిమలను మాటల రూపంలో (ఖడ్గం)లో భక్తులకు వివరిస్తూ. సస్త్రాలు భక్తులు గుచ్చుకుంటారు. స్వామివారిని తలుచుకుంటూ శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంకి చేరుకుంటారు.గ్రామ ప్రజలపై శ్రీ వీరభద్రేశ్వర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తమ కోరిన కోరికలు తీర్చే స్వామివారికి కొబ్బరికాయలు పూలహారలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు బాగా కురిసి రైతులకు పంటలు బాగా పండి గ్రామం ప్రజలను ఆరోగ్యాలతో కాపాడాలని భక్తులు కోరుకున్నారు.అలాగే శ్రీ వీరభద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది.రెండు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం కూడా గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ వీరభద్రేశ్వర స్వామి భక్తులు ప్రజలు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.