కురువ వివాహ పరిచయ వేదిక కు విశేష స్పందన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులుగుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి కార్పోరేటర్ చిట్రా సత్యనారాయణమ్మ మాట్లాడుతూ కురువ కులస్తులు తమ పిల్లల విషయంలో బ్రోకర్లను నమ్మి మోసపోకుండా సంఘం నిర్వహించే వివాహ పరిచయ వేదిక ద్వారా మీకు నచ్చిన సంబంధాలు ఉంటే కుదుర్చుకోవాలని ఆదివారం ఎంపీపీ హాల్లో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు, కట్టుబాటులో ఆచారాలు కల కులం కురువ కులమని మీరు తప్పకుండా మీకు నచ్చిన సంబంధాలను కుదుర్చుకోవచ్చని వారు తెలిపారు.ఈ కార్యక్రమం నకు ఏలూరు, కర్ణాటక, తెలంగాణ, కడప,అనంతపురం తదితర జిల్లా ల నుండి హాజరై నారు.ఈ కార్యక్రమంలోజిల్లా గౌరవ అధ్యక్షులు కె. కిష్టన్న,జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శంకర్, ధనుంజయ సహాయ కార్యదర్శి కొత్తపల్లి దేవేంద్ర,కేసి నాగన్న, పాల సుంకన్న, చంద్రశేఖర్ తిరుపాల్,నందకుమార్, దివాకర్,ఎల్లయ్య, పర్ల రమేష్, హనుమంతు,తదితరులు పాల్గొన్నారు.