విహెచ్పి.. హైందవ శంఖారావం సభకు కర్నూలు నుండి ప్రత్యేక రైలు
1 min readహైందవ శంఖారావం కర్నూలు జిల్లా కన్వీనర్ మాళిగి భానుప్రకాష్…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాల విముక్తి కోసం,స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5 వతేది 2025 విజయవాడలో అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ లక్షలాదిగా తరలిరావాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఒక కార్యక్రమంలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్ మాట్లాడుతూ….హైందవ శంఖారావం ప్రాంత కమిటీ సభ్యులు కేంద్రప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ తో సంప్రదించి “హైందవ శంఖారావం” సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి 15 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనీ ఈ సందర్భంగా కర్నూలు జిల్లా, కర్నూలు నగరం హిందూ బంధువులందరి సౌకర్యార్థం ఒక ప్రత్యేక రైలు కర్నూలు నగరం నుండి 4/1/2025 రాత్రి బయలుదేరనుందని,18 బోగీల ఈ రైలులో 72 స్లీపర్ సీట్లు ఉంటాయి అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చని తెలియజేశారు. అలాగే విజయవాడ లో హైందవ శంఖారావం సభా ప్రాంగణానికి అతి దగ్గరలో” ఉప్పలూరు” రైల్వేస్టేషన్ లో రైలు ఆగుతుందని అక్కడి నుండి నడక మార్గంలో సభాప్రాంగణానికి చేరుకోవచ్చని,దానికి ముందే వచ్చిన హిందూ బంధువులందరికీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి, మరియు అల్పాహారం ఏర్పాట్లు చేశారని అందువల్ల ఏ ఇబ్బంది లేకుండా హిందూ బంధువులందరూ ఈ అవకాశాన్ని కర్నూలు జిల్లా,నగర హిందూ బంధువులు వినియోగించుకుని జనవరి 5 జరిగే ” హైందవ శంఖారావం ” కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఇందుకొరకుచంద్రశేఖర్ : +91 63002 06402, ఈపూరి నాగరాజు : +91 91335 44689 గారలను సంప్రదించాలని కోరారు.