PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2న రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: చెన్నూరు. జూలై 31. మండల కేంద్రమైన చెన్నూరు పడమట వీధిలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఆగస్టు రెండవ తేదీ ఆదివారం మహిళలు, భక్తులు చీరె సారె సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక తెలియజేశారు, ఆదివారం ఉదయం 8 గంటలకు సరస్వతి నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్దకు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు,పండ్లు గాజులు, కాయ కర్పూరం తోపాటు చీర జాకెట్ తో భక్తులు మహిళలు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు ఉదయం చేరుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు, వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా కొత్త రోడ్డు. భవాని నగర్, మెయిన్ రోడ్, నాగల కట్ట వీధి, పడమట వీధిలో వెలసి ఉన్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతుందని అనంతరం మహిళలు భక్తులు తెచ్చిన చీరె సారె ను అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు, అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనన్నారు. ఇందుకోసం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

About Author