రెవిన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యం
1 min readప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, రెవిన్యూ సదస్సుల్లో అందిన అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత
విధి నిర్వహణలో సమర్ధతచూపే తహశీల్దార్లకు ర్యాంకింగ్
రెవిన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: భూముల రీ సర్వేకు సంబంధించి అర్జీలను ప్రణాళిక బద్ధంగా జనవరి 31వ తేదీలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి రెవిన్యూ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, భూసేకరణ, రీసర్వే, నిషేధిత భూములు, కోర్టుకేసులు తదితర అంశాలపై రెవిన్యూ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు తమ పనితీరు మెరుగుపర్చుకొని శాఖ ప్రతిష్టను పెంచేందుకు బాధ్యతాయుతంగా కృషిచేయాలన్నారు. పనితీరు కనపరిచే తహశీల్దార్లకు ర్యాంకింగ్ ఇస్తామని, ఉత్తమ తహశీల్దార్లను సత్కరిస్తామన్నారు. ఎలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. రెవిన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, భూసేకరణ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధలో వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధించి అర్జీదారుడు తెలుపుకునే వారిపట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యను శ్రద్ధగా విని ఆ అర్జీని సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యాన్ని సహించేదిలేదని స్పష్టం చేశారు. పిజిఆర్ఎస్ లో అందిన పిర్యాదులును ఎటువంటి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏ ఉండేందుకు ఎంతమాత్రం వీలులేదని స్పష్టం చేశారు. గ్రామ రెవిన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఈవిషయంలో అర్జీ పరిష్కారంలో దీర్ఘకాలిక సమయం తీసుకోకుండా సత్వరచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూములు, 22ఎ నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన ప్రోఫార్మా ప్రకారం ఖచ్చితమైన సమాచారంతో నివేదిక సమర్పించాలని ఆమేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్ధలాలనుగుర్తించి పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి తదితర శాఖల సమన్వయంతో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ కాలనీలను పరిశీలించి ఖాళీ స్ధలాల వివరాలను నెలాఖరులోపు సమర్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ భూ రీస్వే, రెవిన్యూ సదస్సుల్లో అందిన అర్జీల పరిష్కారం, ఫీ హోల్డ్ అసైన్డ్ భూములు, ఎలియేషన్ కేసులు, కోర్టుకేసులు, మ్యూటేషన్స్, ఆర్ఓఆర్ అప్పీలు, రివిజన్ పిటీషన్స్ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో నిర్వహించిన రెవిన్యూ సదస్సుల్లో వివిధ సమస్యల పరిష్కారం కోసం 6,453 అర్జీలు రాగా వాటిలో ఇప్పటికే 3,312 అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలినవి ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా నూరుశాతం అర్జీలు పరష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ సదస్సులను సమర్ధవంతంగా నిర్వహించిన రెవిన్యూ అధికారులను ఆమె అభినందించారు.రెవిన్యూకు సంబంధించి వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచిన తహసిల్దార్లకు ర్యాంకింగ్ లు గత నవంబరులో జరిగిన రెవిన్యూ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పేర్కొన్న విధంగా రెవిన్యూకు సంబంధించి వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచినవారికి ర్యాంకింగ్ లను ప్రకటించారు. ఇందులో మొదటి ర్యాంక్ భీమడోలు తహశీల్దారు రమాదేవి, మొదటి ర్యాంకును సాధించగా చింతలపూడి, పెదపాడు మండల తహశీల్దార్లు ప్రమద్వార, కృష్ణజ్యోతి ద్వితీయ, తృతీయ ర్యాంకులను సాధించారు. ఈ సందర్బంగా మొదటి ర్యాంకు సాధించిన భీమడోలు తహశీల్దారు బి. రమాదేవికి బెస్ట్ ఫెర్ ఫార్ఫార్మింగ్ మెమెంటో అందించి శాలువతో కలెక్టర్ వెట్రిసెల్వి సత్కరించారు. సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డిఓలు అచ్యుత అంబరీష్, ఎం.వి. రమణ, సర్వే ఎడి ఎస్ హెచ్ యండి అన్సారీ, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.ఎస్. రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.