పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి …నగరపాలక సంస్థ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు, సుంకేసుల జలాశయం నుండి మునగాలపాడు సంబర్ స్టోరేజ్ ట్యాంకు వరకు రూ.82 కోట్లతో నిర్మిస్తున్న పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు. బుధవారం సుంకేసుల జలాశయం వద్ద ఇంటెక్ వెల్, పైప్‌లైన్ పనులను కమిషనర్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, జలాశయం నీటి సామర్థ్యం, ఎస్.ఎస్. ట్యాంకుకు సరఫరా వంటి వివరాలను కమిషనర్ అడిగితెలుసుకున్నారు. అలాగే రాజ్‌వీహర్ సమీపంలో హంద్రీ నదిని కమిషనర్ పరిశీలించారు. నదిని శుభ్రంగా ఉంచాలని, అనవసరమైన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ చంద్రమోహన్, డిఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ నాగశేఖర్, ఏజెన్సీ ఇంజినీర్ సుబ్బయ్య, నగరపాలక ట్రైనీ ఏఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.