PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి

1 min read

– జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు అందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన రిటర్నింగ్ అధికారులను ఫోన్ ద్వారా అదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి కమాండ్ కంట్రోల్ రూమ్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ సరళిని పరిశీలిస్తూ పోలింగ్ కేంద్రాల బయట ఓటర్లు ఎక్కువ సేపు వేచి ఉండకుండా పోలింగ్ కేంద్రాలల్లో పోలింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారుల ద్వారా సెక్టార్ ఆఫీసర్లకు, బిఎల్ఓల ద్వారా పోలింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలింగ్ సమయం పూర్తి అయిన కూడా పోలింగ్ కేంద్రాల బయట ఎంతమంది ఓటర్లు ఉన్న వారికి స్లిప్స్ పంపిణీ చేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ పూర్తి అయిన తరువాత ఈవిఎంలను జాగ్రతగా సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్ జాఫర్, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

About Author