భూ సమస్యల సత్వర పరిష్కారమే-కూటమి ప్రభుత్వ ధ్యేయం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార ఉద్యమంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం నాడు హొళగుంద మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో హొళగుంద తహసిల్దార్ సతీష్ కుమార్ ని అభినందన పూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ హొళగుంద మండల కన్వీనర్ టి.తిప్పయ్య మండల వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రెవెన్యూ సదస్సులను దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు తహసిల్దార్ సతీష్ కుమార్ కు సత్కరించే అభినందించారు. తదనంతరం మండల కన్వీనర్ టి. తిప్పయ్య మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మకంగా భూ సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు గత వైసిపి ప్రభుత్వం ప్రజలను నానా కష్టాలకు గురిచేయడంతో పాటు రాష్ట్రాన్ని కకవికలం చేసి, రైతులను నరక కోపంలో నెట్టివేసేందుకు తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా కూటమి ప్రభుత్వం రాగానే దానిని సంపూర్ణంగా తొలగించి ప్రజలకు న్యాయం చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి ఆశయంగా ప్రజా పక్షపాతి పాలన కొనసాగుతుందన్నారు. మరియు భూకబ్జాలు, భూరికార్డుల తారుమారు తదితర ఆకృత్యాలకు తావు లేకుండా మన కూటమి ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని మరింతగా పటిష్ట పరిచే ప్రణాళికను తయారు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు తోక వెంకటేష్,గాదిలింగ, బాగోడి రాముడు, యువ నాయకులు ఖాదర్ భాషా, వలిభాష, మంజునాథ్, బసప్ప తదితరల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.