PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రమశిక్షణ గల పౌరులుగా చిన్నారులను తీర్చిదిద్దేసత్తా క్రీడలకే ఉంది…

1 min read

సిలంబం వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : చిన్నారులను దేశానికి ఉపయోగపడే క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దే సత్తా ఒక్క క్రీడలకు మాత్రమే ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సిలంబం (కర్ర సాము) వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలంబం (కర్ర సాము)  క్రీడలో సాధన చేస్తున్న క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శిలంబం ( కర్ర సాము) శిక్షకుడు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని చెప్పారు. ఏ దేశ భవిష్యత్తు అయినా విద్యార్థులు చదువుకునే తరగతి గదిలోనే తయారవుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏ దేశ భవిష్యత్తు కైనా నిజమైన పెట్టుబడి ఈ తరం చిన్నారులే అని చెప్పారు. దేశ భవిష్యత్తు భావిభారత పౌరులైన ఈ తరం చిన్నారుల పైన ఉందని అందుకే వారిని క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల క్రమశిక్షణగా పౌరులుగా ఎదిగి దేశానికి ఉపయోగపడతారని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో దేహదారుడ్యం పెరగడంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందించ వచ్చని వివరించారు. యోగా, మెడిటేషన్ వంటి ప్రక్రియల వల్ల వారు పరిపూర్ణ ఆరోగ్యంతో సమాజానికి ఉపయోగపడతారని, అలాగే వారు అన్ని విధాల అభివృద్ధి చెందుతారని చెప్పారు. మో క్కై వంగనిది మానై వంగదని సామెత ఉందని అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చిన్నతనం నుంచే సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని వివరించారు. ప్రస్తుతం సరైన వ్యాయామం లేకపోవడం వల్ల బిపి, షుగర్, అధిక బరువు వంటి జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు గురై ఇబ్బందులు పడుతున్నారని, క్రీడల్లో పాల్గొంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని, ప్రతి రోజు ఒక ఆపిల్ పండు ఇవ్వడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా సంవత్సరం పాటు లభించే ఆపిల్ పండు తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులకు గురికాకుండా జీవించవచ్చని వివరించారు, సీజనల్ గా లభించే పండ్లను కూడా తమ పిల్లల ఆహారంలో చేర్చాలని వివరించారు. ప్రస్తుతం సమాజంలో మత్తుమందులు, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, చివరకు తరగతి గదుల వరకు ఇది పాకిందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఇలాంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అని వివరించారు. ఇన్ని ఉపయోగాలున్న క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరారు. కర్నూల్ నగరంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ చెప్పారు.

About Author