మచ్చలేని చంద్రుడు దేవాదాయ కమీషనర్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : దుర్గగుడిలో 10 మంది పరిచారికులు నీ 50 లక్షలు లంచం తీసుకొని పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించిన దేవాదాయ శాఖ కమీషనర్ అనే శీర్షికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ కమీషనరు వారైన శ్రీరాము సత్యనారాయణపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచురించిన అవాస్తవ వార్త కథనమని ఎపి ఎండోమెంట్స్ ఎంప్లయిస్ వెల్ఫేర్ ఆసోసియోషన్ అధికార ప్రతినిధి కోగంటి రవి కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొటికలపూడి హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. మచ్చలేని చంద్రుడిలా నిబద్ధతతో పనిచేస్తూ, ఆపదలో అండగా ఉంటూ, అందరికీ సమ న్యాయం చేస్తూ, ఆయన సేవల ద్వారా ఈ శాఖ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేస్తూ, భగవత్ సేవలో తరిస్తూ, అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న సహృదయులు, మంచి మనిషి అయిన మా దేవదాయ ధర్మదాయ శాఖ కమీషనరు వారిపై ఇటువల ఓ వార్త పత్రిక నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారం.మరల ఇటువంటి ఆరోపణలు ప్రచురిస్తే సహించేది లేదనన్నారు., ఇందుపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు, పరువు నష్టం చెల్లించవలసివస్తుంది అని తెలియజేస్తూ, “తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు” అన్న చందాన వార్త హెడింగ్ లో ఉన్న “సి” తప్పును కూడా గమనించుకోలేని, సరిదిద్దుకోలేని పత్రిక ఇలాంటి అవాస్తవ కధనాలు, వార్తలు ప్రచురించడం సరికాదని గుర్తుంచుకోవాలని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించడం పత్రికా విలువలను దిగజార్చడమే అవుతుందని తెలిపారు.