కొత్త టెక్నాలజీ డ్రోన్లలతో పంటలకు మందు పిచికారి
1 min readరైతులకు సమయం ఆదా ..తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : పెద్ద పెద్ద రాజకీయ సమావేశాలకు, సినీ కార్యక్రమాలకు, పెళ్ళిలకు వాడే డ్రోన్లు ఇప్పుడు పంట పొలాలకు మందు పిచికారి చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. కొత్త టెక్నాలజీ డ్రోన్ల తో పంటలకు మందు పిచికారి చేస్తున్నారు. మండల పరిధిలోని సూగురు గ్రామానికి చెందిన దేవ అనే యువకుడు డ్రోన్ల తో పంటలకు మందు పిచికారి చేస్తున్నాడు. శుక్రవారం మండల పరిధిలోని చెట్నహల్లి గ్రామంలో రైతుల కు సంబంధించిన మిరప పంటలకు డ్రోన్ల తో మందు పిచికారి చేయడం చూసి రహదారి పై వెళ్లే ప్రయాణికులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా దేవ మాట్లాడుతూ ఈ డ్రోన్ 12 కి మీ వరకు పోతూ మందు పిచికారి చేస్తుందని అయితే నెట్ వర్క్ లేక రెండు కిలోమీటర్ల వరకు పోతుందని తెలిపారు. 12 లీటర్ల నీటి సామర్ధ్యం గల ట్యాంక్ ఉంటుందని ఇందులో మందు కలిపి ఒక ఎకరా పంట ను నాలుగు నిమిషాల్లో మందు పిచికారీ చేయడం జరుగుతుందని తెలిపారు. దీంతో రైతులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. మందు పిచికారి చేయడానికి ఎకరాకు రూ 5 వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.