శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
1 min readకేదవరం గ్రామానికి చెందిన కాళ్ల అప్పారావు వెండి కూజ బిందె బహుకరణ
కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శనం,శేష వస్త్రాలు అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కొల్లేటికోట గ్రామ దేవత శ్రీ పెద్దింటిలమ్మవారి ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు, వివిద ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల తో ఆలయం కిటకిట లాడింది,భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చు కు న్నారు, అమ్మవారికి నైవేద్యములు సమర్పించుకొని తీర్ధ ప్రసాదములు పొందారు. భక్తులకు ఏవిదమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల వేణుగోపాలరావు తగిన ఏర్పాట్లను చేశారు. దెందులూరు మండలం, పోతునూరు పంచాయితీ, కేధవరం గ్రామా నికి చెందిన కాళ్ళ అప్పారావు అమ్మవారి దేవస్థానమునకు 500 గ్రాములు వెండి కూజా బింది బహుకరించారు. ఆలయానికి అనుబంధముగా ఉన్న గోకర్ణపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోకర్ణేశ్వరస్వామి వారికి కూడా 500 గ్రాములు వెండి కూజా బింది కానుకగా సమర్పించారు. దేవస్థానం ఈ ఓ వేణుగోపాలరావు, ఆలయ సిబ్బంది, దాత అప్పారావు కుటుంబ సబ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి శేషవస్త్రములతో సత్కరించి తీర్ధ ప్రసాదములు అందజేశారు, ఈ సందర్బంలో శ్రీ అమ్మవారి ఉపప్రదాన అర్చకులు శ్రీ పేటేటి పరమేశ్వరరావు మరియు శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు పాలపర్తి శ్రీహరి పాల్గొన్నారు.