చెన్నూరులో వైభవంగా శ్రీ సరస్వతి దేవి అలంకారం
1 min readకనుల పండుగ బిందె సేవ. అమ్మవారు నవదుర్గల అలంకారంతో పురవీధుల్లో ఊరేగింపు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు లో బుధవారం ఏడవ రోజు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంతో కొలువుదీరారు. అలాగే వాసవి కనుక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయం ఆవరణంలో ఉదయం 8.9.10. తరగతుల విద్యార్థులకు ఆలయ కమిటీ క్విజ్ పోటీలు నిర్వహించారు. సాయంత్రం పెన్నా నది ఒడ్డున వెలసిన శివాలయం దగ్గరనుంచి శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు బిందెసేవ కార్యక్రమంలో భాగంగా భాజా భజంత్రీలతో అమ్మవారు నవదుర్గల అలంకారంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపుగా తీసుకువచ్చిన అమ్మవారి నవదుర్గల ప్రతిమలను శ్రీ సరస్వతి దేవి అలంకారం ఎదుట ఉంచారు. రాత్రి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి బిందెసేవ మూల నక్షత్రం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆర్యవైశ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.