వైభవం..శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం..
1 min readకర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా దేవాలయ అర్చకులు శ్రీ రమా సహిత శ్రీ సత్య నారాయణ స్వామి వారి వ్రతం అత్యంత వైభవం గా నిర్వహించారు. దేవాలయ ట్రస్టు చైర్మన్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.