శ్రీశ్రీశ్రీ వసంతాలమ్మ అమ్మ వారిని దర్శించుకున్న డీపీఓ దంపతులు
1 min readశైలజ పూర్వికులు ముచ్చు ముల్లి ప్రాంతానికి చెందినవారు
భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారం వసంతాలమ్మ అమ్మవారు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రామచంద్రపురం ముచ్చుమిల్లిలో కొలువైన శ్రీశ్రీశ్రీ వసంతాలమ్మ అమ్మవారికి ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీవాస విశ్వనాధ్, శైలజ దంపతులు ఆదివారం విశేష పూజలు చేసారు. భక్తులకు కొంగుబంగారంగా పిలవబడుతు కోరిన కోరికలు తీర్చే దేవతగా అమ్మవారు దర్శనం ఇస్తుంటారని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఈ కారణంతో అనేక మంది భక్తులు ఇతర జిల్లాల, ప్రాంతాల నుంచి వచ్చి వసంతలమ్మా అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం అనవయితీ జరుగుతుంది. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ శైలజ దంపతులు అమ్మవారికి గరగలతో మొక్కు తీర్చుకున్నారు. డీపీఓ మాట్లాడుతూ సతీమణి శైలజ పూర్వికులు ముచ్చిముల్లి ప్రాంతానికి చెందినవారని, ఉద్యోగరీత్యా జిల్లాకి దూరంగా ఉన్నా అనేక మంది బంధువులు రామచంద్రపురం పరిసర ప్రాంతాలలో ఉండడం వలన పండగలకు, కుటుంబ కార్యక్రమాలకు రావడం జరుగుతుందని అన్నారు. వార్షిక వేడుకలలో భాగంగా ఆదివారం వసంతాలమ్మా అమ్మవారికి గరగల సంప్రదాయంతో భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో ఏలూరు డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్, శైలజ దంపతులు కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు డీపీఓ దంపతులకు ఆలయ మర్యాదలతో అభిషేకాలు మరియు అమ్మవారి దర్శనం తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.