PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భాష్యం స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణామి వేడుకలు

1 min read

బాల కృష్ణుల వేషదారణలో అకట్టుకున్న బాలబాలికలు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో రాయలసీమ జోన్ సీఈవో అనిల్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో ముందస్తు శ్రీకృష్ణామి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో బాలబాలికలు అకట్టుకున్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న బాలుడితో ప్రిన్సిపాల్ మాచాని కవిత ఉట్టిని పగలగొట్టించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో పండగల విశిష్టతలును విద్యార్థినీ, విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా అన్ని పండగలను జరుపుకుంటున్నామని చెప్పారు. శ్రీ మహవిష్ణువు అవతారమే శ్రీకృష్ణుడని ఆయన లీలలు విద్యార్థులకు వివరించటం జరిగిందన్నారు. అనంతరం శ్రీకృష్ణడు, గోపికల వేషదారణలో చిన్నారులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చాంప్స్ ఇన్చార్జి, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదతరులు పాల్గొన్నారు.

About Author