సిఐ ని కలిసిన మాజీ అటవీశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి
1 min readమండల టీడీపి నాయకులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లెకు చెందిన మాజీ అటవీ శాఖ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు రామన శ్రీలక్ష్మి దంపతులు, రామనపల్లె ఉపసర్పంచ్ పుత్తా వేణుగోపాల్ రెడ్డి సోదరులు మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పురుషోత్తం రాజును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రామనశ్రీలక్ష్మి ,పుత్తా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, సీఐ పురుషోత్తం రాజు గతంలో చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఉన్నప్పుడు శాంతిభద్రతాలు, అలాగే అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చాలా కట్టుతిట్టంగా ఆయన విధులు నిర్వహించడంతో పాటు చెన్నూరు మండల ప్రజలకు ఆయన సుపరిచితులుగా ఉండేవారని తెలిపారు. మళ్లీ ఆయన చెన్నూరు పోలీస్ స్టేషన్ కు సిఐ గా రావడం చాలా సంతోషకరమని, మండలంలో శాంతిభద్రతల తో పాటు ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉంటారని వారు తెలియజేశారు, అలాగే టిడిపి నాయకులు తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి, అల్లాడు రాజశేఖర్ రెడ్డి, టిడిపి బీసీ నాయకులు వేల్పుల సుబ్రహ్మణ్యం, బడిగింజల మురళి, ఐ టి డి పి చాంపియన్ యమాల మణికంఠ లు మర్యాదపూర్వకంగా కలిసి సిఐ పురుషోత్తం రాజు కు శాలువా కప్పి పుష్ప గుచ్చం ఇచ్చి ఆయనను సన్మానించారు.