శ్రీమద్రామాయణం భారతీయుల జీవనాడి
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
పారుమంచాలలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీమద్రామాయణం భారతీయుల జీవనాడి అని, మానవీయ విలువలకు పట్టం కట్టిన శ్రీమద్రామాయణం యావత్ సృష్టి ఉన్నంతవరకు ఆదర్శంగానే నిలుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా మండలం, పారుమంచాల గ్రామంలో వెలసిన శ్రీ రామాలయం నందు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాల ప్రారంభం సందర్బంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. తదనంతరం తితిదే ధర్మాచార్యులు ఆమంచి వేంకటేశ్వర్లు చేసిన శ్రీమద్రామాయణం – మానవీయవిలువలు అనే అంశంపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షుడు పాల రాముడు, పి. శివారెడ్డి, పి.లోకేశ్వర రెడ్డి, కె.జనార్ధన రెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు పి.రామచంద్రుడు, పాపయ్యాచారి, సి.చెన్నప్ప ఎస్.వెంకటస్వామి, వి.హరి, నాయుడు, సి.వెంకట రమణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.