PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 20న శ్రీశైల గిరిప్రదక్షిణ

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం :  శ్రీశైల దేవస్థానంగిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారుపౌర్ణమి రోజుసాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది.ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది.బయలువీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది.గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణానంతరం శ్రీస్వామివార్లదర్శనం.

About Author