పేషెంట్స్ రద్దీ దృష్ట్యా ..ఈ డిజిటల్ ఓపి కౌంటర్ ప్రారంభం
1 min readకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపి కౌంటర్ దగ్గర పేషంట్ల రద్దీ తగ్గుదల గురించి.
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓపి కోసం ఆసుపత్రికి వచ్చే నలుమూలల పేషెంట్స్ రద్దీ దృష్ట్యా ఈరోజు అదనంగా మరో ఈ డిజిటల్ ఓపి కౌంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని ఈ డిజిటల్ ఒపి రెండవ కౌంటర్ పెట్టడం ద్వారా ఈరోజు 2400 మంది ఔట్ పేషెంట్లు ఆసుపత్రికి వచ్చినట్లు తెలియజేశారు. అందులో 2200 మందికి 10.30 AM లోపల ఓపి ఇచ్చి వేయడం వలన రద్దీ పూర్తిస్థాయిలో తగ్గింది.ఈ డిజిటల్ ఓపి కౌంటర్ సక్సెస్ కావడానికి ఫార్మసీ విద్యార్థులు మరియు నర్సింగ్ సిబ్బంది సేవలు బాగా ఉపయోగపడినట్లు తెలియజేశారు. ఆస్పత్రిలో ఎవరైనా స్వచ్ఛందంగా NSS (ఎన్ఎస్ఎస్) తరపున ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు ఉదయం రోగికి సహాయం కొరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా రావాలని వారిని సూచించారు.ఆస్పత్రిలో దీని ద్వారా ప్రజలకు అవగాహన కలుగుతుందని అనంతరం వాళ్లకు కూడా సేవా భావం కలుగుతుంది అని తెలియజేశారు.ఆసుపత్రిలో త్వరలో స్త్రీల కొరకు అదనంగా మరో రెండు ఓపి కౌంటర్లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ మరియు ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, డా.శివబాల నగాంజన్, మరియు నర్సింగ్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి,తెలిపారు.