PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్ జిల్లా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు

1 min read

కర్నూల్ నగరంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధితో  పాటు మరో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు కృషి చేస్తా.

9వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధితోపాటు మరో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ లో ఏర్పాటుచేసిన తొమ్మిదవ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ ఛాంపియన్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తోపాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1974లో తాను కర్నూలుకు వచ్చిన కొత్తలో స్విమ్మింగ్ పూలు నిర్మాణం జరుగుతున్న సమయంలో తన సహకారం కోరారని, తాను కూడా అందుకు సహకరించానని వివరించారు. స్విమ్మింగ్ పూల్ లో జరిగిన ప్రతి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని ఆయన తెలియజేశారు. కర్నూల్ నగరంలోని స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ అసోసియేషన్ గా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆయన కొనియాడారు .ఏ కార్యక్రమం చేపట్టాలన్న అందుకు అవసరమైన కృషి ఉండాలని ఆయన సూచించారు. అసోసియేషన్ ప్రతినిధులు చక్కగా పనిచేస్తేనే దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారని ఆయన తెలియజేశారు. స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు చక్కగా పనిచేయడం వల్లే దాతలు కూడా విరాళాల ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు .ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు సంబంధించి బహుమతుల ప్రధానానికి అయ్యే 50 వేల రూపాయలు తన కుమారుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరు మీద తాను అందజేస్తానని తెలియజేశారు. ఈ పోటీల విజేతలకు తన కుమారుడు టీజీ భరత్ పేరు మీద బహుమతులు అందజేయాలని సూచించారు. నగరంలోని స్విమ్మింగ్ పూల్ నిర్వహణ చక్కగా ఉందని ఎప్పటికప్పుడు నీటిని శుభ్రంగా ఉంచడంతోపాటు నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కర్నూల్ నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్ లో స్విమ్మింగ్ ఏర్పాటు చేసేందుకు తాను ప్రయత్నించానని, అయితే బెటాలియన్ అధికారులు అందుకు ఏ కారణం చేతనో ముందుకు రాలేదని తెలిపారు. కర్నూల్ నగరంలో తగిన స్థలం లభిస్తే మరో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అవసరమైన కృషి చేస్తానని తెలిపారు.

 అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తో పాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో క్రీడలు అంటే మొదటగా గుర్తు వచ్చేది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అని వివరించారు. వారి సహకారంతోనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కర్నూల్ నగరంలో క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా నగరంలోని స్విమ్మింగ్ పూల్ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు.

About Author