PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి..

1 min read

రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల…

ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ కు ధన్యవాదాలు తెలిపిన మండల నాయకులు…

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని మండల కూటమి నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్  గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆలూరు నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ సహకారంతో రోడ్ల మరమ్మత్తుల కొరకు 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని అన్నారు.కొందరు సోషల్ మీడియాలో రోడ్ల మరమ్మత్తులు గురించి ట్రోల్ చేస్తున్నారని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మత్తుల నోచుకోక ప్రజలు నానాయాతన పడిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ట్రోల్లింగ్ చేయడం మానుకొని ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులలోనే రోడ్ల మరమ్మతులకు కొరకు 300 కోట్ల భారీ నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా సీనియర్ నాయకులు అబ్దుల్ సుభాన్, వీరన్న గౌడ్, గాదిలింగ, మోయీన్,సలీం, కోగిలతోత జాకీర్ మంగయ్య, మహమ్మద్, సుభాన్,శాలి.అమాన్,అల్తాఫ్,జనసేన కన్వీనర్ అశోక్, వరాల వీరేష్, ఈరన్న,గంగా,బిజెపి మండల కన్వీనర్ నరసింహ ప్రసాద్, చిదానంద తదితరులు పాల్గొన్నారు.

About Author