ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
1 min readకాకినాడలో జులై 8 9 10 తేదీలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ విజేంద్ర మాట్లాడుతూ కాకినాడలో జులై 8 9 10 తేదీలలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువుతోపాటు రాజకీయాల పైన మరియు ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశలోనే నేర్చుకోవాలని తెలిపారు. కేవలం చదివే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సమాజంలో విద్యావ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికితీయడానికి, అవినీతి అక్రమాల పైన పోరాటాలు చేయడానికి ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై విద్యార్థులలో చైతన్యం నింపడానికి విద్యార్థుల శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల దృష్టిని ఆలోచించి తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ప్రస్తుతం అధికారంలోకి రావడంతో విద్యార్థుల హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ విధానాన్ని రద్దుచేసి ఆఫ్లైన్ విధానంలో కొనసాగించాలని పేర్కొన్నారు. పీజీ విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను రద్దు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలువిడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. కాకినాడలో జరుగుతున్న శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విద్యార్థులు లోకానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సమీర్, అబ్దుల్ ఖాదర్, రయాన్, నరసింహులు, రవి, శివ,సురేష్,మహేష్, తదితరులు పాల్గొన్నారు.