PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రగ్స్​ కు దూరంగా ఉండండి…

1 min read

మాదక ద్రవ్యాలకు బానిసైతే…బతుకు ఛిద్రం..

  • నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సైకియాట్రి విభాగాధిపతి డా. ఇక్రముల్లా
  • కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో యువతకు అవగాహన

కర్నూలు, పల్లెవెలుగు:యువతను లక్ష్యంగా చేసుకుని …. డ్రగ్స్​ విక్రయాలు జరుగుతాయని,   యువతకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని  సూచించారు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సైకియాట్రి విభాగాధిపతి డా. ఇక్రముల్లా . ఆదివారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో యువతకు ‘  డ్రగ్స్​ వాడకంతో జరిగే నష్టాలు’ పై  అవగాహన సదస్సు నిర్వహించారు. హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి, సీనియర్​ కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సైకియాట్రి విభాగాధిపతి డా. ఇక్రముల్లా మాట్లాడారు. డ్రగ్స్​ తీసుకుంటే… కేంద్ర నాడీ వ్యవస్థపై , శారీరక అవయవాలపై ప్రభావం పడుతుందని, మెదడు పని చేయడం మందగిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా గుండె హృద్రోగం అధికంగా పెరిగి… మత్తులో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారి ప్రవర్తన, మాట తీరు సరిగా ఉండదని, అలాంటి వారికి సమాజంలో విలువ ఉండదన్నారు.  యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,  డ్రగ్స్​ కు జోలికి వెళ్లవద్దని ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సైకియాట్రి విభాగాధిపతి డా. ఇక్రముల్లా ఈ సందర్భంగా వెల్లడించారు. కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో  వివిధ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

డా. ఇక్రముల్లాకు ఘన సన్మానం

 డ్రగ్స్​ తీసుకుంటే కలిగే నష్టాలు.. సమాజంలో ఆ వ్యక్తికి ఉన్న విలువ, ఆరోగ్యం పై పడే ప్రభావం తదితర అంశాలపై  యువతకు క్షుణ్ణంగా వివరించిన నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సైకియాట్రి విభాగాధిపతి డా. ఇక్రముల్లాను కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ గౌరవ అధ్యక్షుడు డా. భవాని ప్రసాద్​,  ప్రధాన కార్యదర్శి . సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​, సభ్యులు చంద్రశేఖర్​ కల్కూర తదితరులు ఘనంగా సన్మానించారు.

About Author