ఓర్వకల్ లో డ్రోన్ హబ్‌కు ఏర్పాటుకు చర్యలు
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
జిల్లా కలెక్టర్ తో చర్చించిన ఆంధ్ర ప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ కె. దినేష్ కుమార్
పల్లెవెలుగు ఎబ్ కర్నూలు : కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శనివారం సాయంత్రం ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్ ని కలిసి ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ హబ్ కు ఎంపిక చేయనున్న భూములపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందన్నారు.. ఇందుకు అవసరమైన భూముల ఎంపికపై డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ తో చర్చించామన్నారు.ఓర్వకల్లు మండలం పాలకొలను, కొమరోలు వద్ద డ్రోన్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలాలుగా సూచించామని కలెక్టర్ తెలిపారు..ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందన్నారు..డ్రోన్ హబ్ ఏర్పాటు వల్ల జిల్లాలో ఎంతో మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు.. హబ్ ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ కు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ అంశంపై రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ వివరించారు.