ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టండి
1 min readయూరియా, డిఎపి రైతులకు అందుబాటులో తీసుకురావాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలని, యూరియా, డిఎపి కొరత నివారించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సోమవారం ఏలూరు పవర్ పేట లోని అన్నే భవనంలో ఎరువుల కొరత పై ఆయన మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సి రావడంతో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించడం దారుణమని విమర్శించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, ఎరువుల షాపుల చుట్టూ రైతులు తిరగాల్సి వస్తోందన్నారు. ఇష్టారాజ్యంగా నిబంధనలు విరుద్ధంగా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు కి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.