సాధ్యం కాని టార్గెట్ల కు స్వస్తి పలకాలి… ఏ ఐ జి డి ఎస్ యూ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : గ్రామీణ డాక్ సేవక్ లకు నిత్యం వేధిస్తున్న టార్గెట్లను వెంటనే నిలిపివేయాలని ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల ఆర్ ఎస్,హెడ్ పోస్ట్ ఆఫీస్ ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈసందర్బంగా రాష్ట్ర, డివిజన్ నాయకులు మర్రెడ్డి, జమాల్ బాషా, శశి శేఖర్ లు మాట్లాడుతూ కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టులో మిగిలి ఉన్న అన్ని సానుకూల సిపార్సులను తక్షణమే అమలు చేయాలన్నారు. జి డి ఎస్ లకు 8గంటల పనిదినాలు కల్పించి డిపార్ట్ మెంట్ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. మెయిల్స్ అదేరోజు డిస్పోజ్ అయ్యే విదంగా అన్ని మెయిల్ ఆఫిసులలో రాత్రి ఏర్పాట్లను చేయాలన్నారు. తపాలా శాఖలో పార్ట్ టైం ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ,నెలవారీ వేతనం సక్రమంగా అందజేయాలని కోరారు.ఈకార్యక్రమంలో ఆదినారాయణ,జైలాన్,మధుసూదన్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.