కూటమి ప్రభుత్వం కప్పట్రాళ్ల యురేనియం తవ్వకాలను వెంటనే ఆపాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: పచ్చని వ్యవసాయ భూములను నాశనం చేయాలనే ఆలోచనతో ఇచ్చిన GO ను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి . ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏచర్యనైనా అడ్డుకుంటాం….. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి .ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో పచ్చని వ్యవసాయ పొలాలలో యురేనియం తవ్వకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన GO కు వ్యతిరేకంగా 15 గ్రామాల ప్రజలతో కలసి భారీ ధర్నా చేసిన ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి .ఈరోజు కప్పట్రాళ్ల పచ్చని పొలాల్లో యురేనియం తవ్వకాల కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచన GO కు విరుద్ధంగా రైతులు, రైతు సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి శ్రీ బుసినే విరుపాక్షి మీడియాతో మాట్లాడుతూ గతంలో అనేక దశాబ్దాలు ఫ్యాక్షన్ గొడవలతో నష్టపోయి ఇప్పుడిప్పుడే పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా బ్రతుకుతున్న కప్పట్రాళ్ల చుట్టు ప్రక్కల 15 గ్రామాల రైతులు ప్రజలు మోసపు హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దోచుకో దాచుకో తినుకో అన్న రీతిగా నిరంకుశ పాలన చేస్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను దిగజారుస్తోంది .ఇప్పుడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కప్పట్రాల్ల గ్రామం మరియు చుట్టుపక్కల 15 గ్రామాల పచ్చని పొలాల మీద ఈ కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతుందన్నారు .ప్రజల తరపున పోరాటం చేస్తున్న మమ్ములను పోలీసులతో నిర్బంధించినా, అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా కూడా ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రజల మనిషిగా పోరాటం చేస్తానని శ్రీ బుసినే విరుపాక్షి అన్నారు.ఈ ధర్నా కార్యక్రమంలో శ్రీ బుసినే శ్రీరాములు , శ్రీ బుసినే వెంకటేష్ , ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువనేత శ్రీ బుసినే చంద్రశేఖర్,రైతు సంఘాలు, ప్రజా సంఘాలు శ్రీ దివాకర్ నాయుడు,దేవనకొండ మండల జడ్పిటిసి కిట్టు , లుముంబా , మండల కన్వీనర్ తపాలా శ్రీనివాసులు , దేవనకొండ మండల ఎంపిటిసిలు,అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, రైతులు, ప్రజలు, వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .