PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామంలో  వీధి కుక్కలు… కోతుల బెడద

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మేజర్ గ్రామపంచాయతీ హొళగుంద గ్రామ ప్రజలకు  తెలియజేయడమేమనగా   హొళగుంద గ్రామంలో విపరీతంగా వీధి కుక్కలు మరియు కోతులు బెడద ఉందని పంచాయతీ ఆఫీస్ నందు సర్పంచ్కి మరియు పంచాయతీ సెక్రెటరీకి అర్జీ ఇచ్చి ఉన్నారు. అర్జీ మేరకు పైన అధికార ఆదేశాల మేరకు కోతులు మరియు కుక్కలు పట్టుకునేవారు వచ్చి ఉన్నారు. వాటిని పట్టుకున్నా కూడా దూరం ఒక 30 40 కిలోమీటర్లు దూరంలో అడవిలో వదులుతామని పంచాయతీ సర్పంచ్ చాలవాది రంగమ్మ తనయుడు పంపాపతి  మరియు పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. గ్రామ ప్రజలకు అందరికీ తెలియాలని ఈ సమాచారం చేరవేస్తున్నామని వారు తెలిపారు. గ్రామ సర్పంచ్ చలవాది రంగమ్మ తనయుడు పంపపతి మరియు రాజశేఖర్ గౌడ్ గ్రామ ప్రజలు సహకరించాలని తెలియజేయడం జరిగింది.

About Author