PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గో హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి: విహెచ్​పి ఏపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ దైవంగా భావించే గోమాతలను అక్రమంగా తరలిస్తూ వధిస్తూ కేవలం హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ప్రతినిత్యం గోవధ జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అత్యధికంగా గోవధ జరిగే అవకాశాలు ఉన్నాయని అటువంటి చర్యలను అడ్డుకోవాలని సంబంధిత అధికారులకు విశ్వ హిందూ పరిషత్ , బజరంగ్దళ్ మరియు అనేక ధార్మిక సంస్థలు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా.. నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం దేనికి సంకేతం అని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తున్నది.అడపా దడపా బజరంగదళ్ కార్యకర్తల సమాచారం మేరకు పోలీసు వారు కొన్నిచోట్ల ఈ అక్రమ గోవధను అడ్డుకుంటున్నప్పటికీ మరికొన్ని చోట్ల సమాచారం ఇచ్చిన వారిని బైండోవర్ కేసుల పేరిట వేధిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది.అక్రమ గో రవాణాను అడ్డుకోవలసిన రవాణా శాఖ, అక్రమ వధశాలను మూసి వేయవలసిన పురపాలక శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు  వీటన్నింటిని సమన్వయం చేయవలసిన రెవెన్యూ శాఖ ఎక్కడ కూడా గోవధను , అక్రమ గో రవాణా ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడడం లేదు.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో గోవధ జరగకుండా ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తున్నది.

About Author